Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కరోనా నివారణ ఖర్చుల కోసమే పెట్రో ధరలు పెరిగాయంటూ కర్నాటక బీజేపీ మంత్రి ఉమేష్ విశ్వనాథ్ అన్నారు. కరోనాను నివారించాలంటే ప్రభుత్వాలకు నగదు కావాలనీ, అందుకే ధరలు పెరుగుతున్నాయంటూ ఆహార, పౌరసరఫరా, వినియోగదారుల సంబంధాలు, అటవీ శాఖ మంత్రి వివరించారు. దేశీయంగా చమురు ధరలను కంపెనీలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాయి. బుధవారం తాజాగా పెట్రోల్, డీజిల్‌లపై 35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 106కి చేరగా, ముంబయిలో రూ. 112కి పెరిగింది. కోల్‌కతాలో రూ. 107గా ఉండగా, చెన్నైలో రూ. 103గా ఉంది. గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు కూడా ఇంచుమించుగా వంద మార్క్‌కు చేరువలో ఉంటున్నాయి. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 109కాగా, డీజిల్ రూ. 100కి చేరింది. కాగా, పన్నుల మినహాయింపు ద్వారా ఇంధన ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై గతవారం ప్రకటించారు. అయితే పన్నుల మినహాయింపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందంటూ బొమ్మై మాట మార్చడం గమనార్హం.