Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : నియోజకవర్గంలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలేమిటని ప్రశ్నించిన యువకునిపై పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. చెంపదెబ్బ కొట్టడంతో పాటు అతనిపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన పఠాన్కోట్ జిల్లా భోవా గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నది. నియోజకవర్గంలో జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే జోగీందర్ పాల్ చర్చ జరుపుతున్నారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక యువకుడు ఇప్పటివరకు నియోజకవర్గంలో మీరు చేపట్టిన అభివద్ధి ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన పాల్ ఆ యువకుని చెంప దెబ్బ కొట్టడంతో పాటు చుట్టూ ఉన్న వారితో కలిసి దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని ఆ యువకుని అక్కడినుండి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో .. పార్టీ అభ్యర్థుల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పాటు ఎమ్మెల్యే దాడి కాంగ్రెస్ అధిష్టానానికి మరో తలనొప్పి తెచ్చిపెట్టినట్లైంది.