Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని 58 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నాలుగు రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాల్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు తగ్గిపోటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సంక్షోభం దిశగా వెళ్తున్న క్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజాగా ఓ ప్రకటజారీ చేసింది. థర్మల్ ప్రాజెక్టులలో పొడి ఇంధన నిల్వ పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డేటా ప్రకారం ఒక వారం క్రితం.. నాలుగు రోజుల వరకు బొగ్గు నిల్వలున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు 69 ఉండగా అక్టోబర్ 18 నాటికి 58కి తగ్గాయి. ఈ నెల ప్రారంభంలో పంజాబ్, గుజరాత్‌తో సహా ఆరు రాష్ట్రాలు తమ పవర్ ప్లాంట్లలో చాలా వరకు కేవలం నాలుగు రోజుల బొగ్గు మాత్రమే మిగిలి ఉందనీ, ఇది అంతరాయాలకు దారితీస్తుందని కేంద్రానికి తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్‌తో సరఫరా పెంచాలని నిర్ణయించింది. కోల్ ఇండియా దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, సరఫరాదారుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పొడి ఇంధన ఉత్పత్తి జరిగినప్పటికీ, సుదీర్ఘ రుతుపవనాలు ప్లాంట్లకు సరఫరాను దెబ్బతీశాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ దేశంలో విద్యుత్ సంక్షోభం గురించి మాట్లాడే అన్ని విషయాలను తోసిపుచ్చారు. విద్యుత్ ప్లాంట్లతో బొగ్గు తగినంత నిల్వలున్నాయని చెప్పారు.
గత రెండు వారాల నుంచి ప్రభుత్వం క్రమం తప్పకుండా బొగ్గు ఉత్పత్తిని, విద్యుత్ ప్లాంట్లకు సరఫరాను పరిశీలిస్తోందని తెలిపారు.