Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ పోలీసులపై ప్రియాంకా గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ : తాను ఎక్కడికి వెళ్లినా పోలీసుల నుంచి తమాషా ఎదురవుతున్నదని ప్రియంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది హాస్యాస్పదమనీ, దీనివల్ల ఎంతమంది ఇబ్బందులకు గురవుతున్నారో తెలుస్తుందా.. ఒక్కసారి ట్రాఫిక్ చూడండి అంటూ యూపీ పోలీసులను ప్రశ్నించారు. ఆగ్రా వెళ్లేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. పోలీస్ కస్టడీలో మృతిచెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న ఆమె కారును పోలీసులు లక్నో - ఆగ్రా జాతీయ రహదారిపై నిలిపివేశారు. కాగా, ఆమెను పోలీసులు అడ్డుకోవడం నెలలో ఇది రెండవసారి కావడం గమనార్హం. గతంలో లఖింపూర్ బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకుని.. స్టేట్ హౌస్‌కు తరలించారు. తనకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాహక్కును ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యోగి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. రూ.25 లక్షలు దొంగిలించాడన్న ఆరోపణలతో ఈ నెల 17న వాల్మీకీ వర్గానికి చెందిన అరుణ్‌కుమార్ అనే వ్యక్తిని యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ కస్టడీలో మరణించాడంటూ బుధవారం పోలీసులు వెల్లడించారు. అరుణ్వాల్మీకి పోలీస్ కస్టడీలో మరణించాడనీ, న్యాయం జరగాలని అతని కుటుంబం ఆశిస్తోందని ప్రియాంకా అన్నారు.
బుధవారం వాల్మీకి జయంతి అని పేర్కొంటూ... ప్రధాని మోడీ బుద్ధుడివలే సందేశం ఇచ్చారనీ.. కానీ యూపీలో పరిస్థితి ఆ సందేశాన్ని ఉల్లంఘించే విధంగా ఉందని ప్రియాంకా ఎద్దేవా చేశారు.