Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌కన్నా ముందున్న పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్
- ప్రపంచ ఆహార భద్రత సూచికలో వెల్లడి
న్యూఢిల్లీ : ఆహారభద్రత విషయంలో భారత్ పనితీరు సరిగా లేదని 'ప్రపంచ ఆహార భద్రత సూచిక-2021' (జీఎఫ్ఎస్ ఇండెక్స్-2021) తాజా నివేదిక హెచ్చరించింది. ఈ ఏడాది 113 దేశాలకు ర్యాంకింగ్స్ విడుదల చేయగా, భారత్‌కు 71వ స్థానం దక్కింది. అయితే చైనా 34వ స్థానం తో భారత్‌కంటే చాలా ముందుంది. పలు అంశాల్లో పాకి స్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలుభారత్కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. భారత్ కంటే పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో తక్కువ ఖర్చుతో ఆహారం అందుబాటులో ఉందని, గడచిన పదేండ్లలో ఆహార భద్రత విషయంలో భారత్ పనితీరు కేవలం 2.7పాయింట్లు మాత్రమే మెరుగుపడిందని 'జీఎఫ్ఎస్ ఇండెక్స్' తెలిపింది. లండన్‌కు చెందిన ఎకానమిస్ట్ ఇంపాక్ట్, అమెరికాకు చెందిన కోర్టెవా అగ్రిసైన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. కోనుగోలు శక్తి, అందుబాటులో ఉండే ఆహారం, నాణ్యత, భద్రత,సహజ వనరులు,.మొదలైన 58 అంశాల ఆధారంగా ఈ సూచీని తయారుచేశారు.
గడిచిన పదేండ్లలో భారత్ పనితీరు గురించి కీలక విషయాలు ఇందులో ప్రస్తావించారు. ఆహార భద్రత విషయంలో 2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత్‌కు కేవలం 2.7 పాయింట్లు పెరిగాయి. ఇదే కాలంలో పాకిస్థాన్ 9పాయింట్లు, నేపాల్7 పాయింట్లు, బంగ్లాదేశ్ 4.7పాయింట్లు, చైనా 9.6పాయింట్లు పెంచుకోగలిగా యని నివేదిక పేర్కొన్నది. తక్కువ ఖర్చుతో ఆహారం కొనుగోలు అనే అంశంలో భారత్‌కు 50.2 పాయింట్లు, పాకిస్తాన్‌కు 52.6 పాయింట్లు, శ్రీలంకకు 62.9 పాయింట్లు దక్కాయి.ఈ ఏడాది విడుదలైన జీఎఫ్ఎస్ ఇండెక్స్‌లో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్,ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా టాప్-10లో నిలిచాయి. ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన 'ప్రజలందరికీ ఆహార భద్రత' అనేదాన్ని 2030లోగా భారత్ సాధించాల్సి వుంది.ఇందుకోసంగానూ ప్రభుత్వాలు తమవైన సంక్షేమ పథకా లు, విధానాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో జీఎఫ్ఎస్ లాంటి సూచికలు విధాన రూపకల్పనకు దోహదపడతాయి. ఆహార భద్రతకు సంబంధించి 58అంశాల్లో సగటున భారత్‌కు 57.2 పాయింట్లు వచ్చాయి. ఏ ఏ అంశాలు దేశంలో ఆహార అభద్రతకు దారితీసాయన్నది అంచనా వేసుకోవడానికి నివేదిక ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019తర్వాత ధరల పెరుగుదల కారణంగా ఆహార భద్రతలో 70 దేశాల ర్యాంకింగ్ పడిపోయాయని నివేదిక తెలిపింది.
ఆకలి కేకలు పెరిగాయి : ఆక్స్‌ఫాం
కరోనా అనంతరం భారత్‌లో ఆకలి కేకలు పెరిగాయని, ప్రపంచ ఆకలి సూచిక(హంగర్ ఇండెక్స్- 2021)లో భారత్ పొందిన (101)స్థానాన్ని బట్టి అది అర్థమవుతోందని 'ఆక్స్‌ఫాం ఇండియా' తెలిపింది. గత ఏడాది 116 దేశాలకు ర్యాంకింగ్స్ విడుదల చేయగా, భారత్‌కు 94వ స్థానం వచ్చింది. ఈ ఏడాది అది మరిం త దిగజారి 101వ స్థానానికి పడిపోయింది. ఆకలి సూచికలో భారత్‌కన్నా పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశా లు మెరుగ్గా ఉన్నాయి.