Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ నుంచి లోక్‌నీతి సత్యాగ్రహ కిసాన్ జన్ జాగరణ్
- యూపీ హర్యానాల్లో రైతులపై వందలాది కేసులు
- బేషరతుగా ఉపసంహరించుకోవాలి : ఎస్కేఎం
న్యూఢిల్లీ : దేశవ్యాప్త రైల్‌రోకోలో పాల్గొన్నందుకు రైతులపై హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి కట్టాయి. ఆ రెండు రాష్ట్రాల్లో రైతులపై వందలాది కేసులను నమోదు చేశాయి. ఈ కేసులను వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. మరోవైపు గాంధీ జయంతి నాడు చంపారన్ నుంచి బయలు దేరిన లోక్‌నీతి సత్యాగ్రహ కిసాన్ జన్ జాగరణ్ పాదయాత్ర 18 రోజుల కొనసాగి బుధవారం వారణాసి నగరానికి చేరుకుంది. ఈ పాదయాత్ర దారిపొడువున మంచి మద్దతును కూడగట్టుకోగలిగింది. భారీ ఆదరణ, ఆతిథ్యాన్ని అందుకున్నది. యాత్ర దాదాపు 330 కిలో మీటర్లు కాలినడకన సాగింది. ఈ యాత్ర యువత,వృద్ధులు, పురుషులు, మహిళలు, పట్టణ, గ్రామీణ పౌరులకు విజయవంతంగా చేరుకుంది. పాదయాత్ర ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో రైతుల పోరాట డిమాండ్లను ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీర్చే వరకు రైతుల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రమాణం చేస్తూ కార్యక్రమం ముగిసింది. లఖింపూర్ ఖేరీ మారణకాండలో న్యాయం కోసం కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా టెనిని తొలగించాలనీ, అరెస్టు చేయాలని పాదయాత్ర డిమాండ్ చేసింది.లఖింపూర్ ఖేరీ మారణకాండ లో న్యాయం కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉత్తరప్రదేశ్, హర్యానా,చండీగఢ్,పొరుగు గ్రామాలు, పంజాబ్, మధ్యప్రదే శ్ రాష్ట్రాల్లో అనేక షహీద్ కిసాన్ ఆస్తికల యాత్రలు జరుగుతున్నాయి.బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.నల్ల జెండాల తో రైతులు తమ నిరసనను తెలుపుతున్నారు. హర్యానాలోని జింద్ జిల్లాలో జులానా పట్టణంలో ఎంపీ అరవింద్ శర్మ జులానా నిరసనను ఎదుర్కొన్నారు.కైతాల్ జిల్లాలో ఉదయం నుంచే మంత్రి కమలేష్ తండాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.''దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కారణంగా లక్షలాది మంది రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. పంట సీజన్ సమయంలో ఇలా భారీ వర్షాలు రైతు లకు కడుపుకోతను మిగిల్చాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాతో సహాయ ఇతర ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల వరి, ఇతర పంటలు పూర్తిగా నాశనమయ్యాయి'' అని ఎస్కేఎం పేర్కొంది. రైతులు ఎదుర్కొంటున్న నష్టాన్ని ప్రభుత్వాలు సమగ్రంగా అంచనా వేయాలనీ, రైతులందరినీ వెంటనే పరిహారం చెల్లించాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది.