Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2021-22 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం చెరుకు రైతులకు ప్రకటించిన ఫేయిర్ రెమ్యూనేషన్ ప్రైస్ (ఎఫ్ఆర్పి)ని వాయిదాల్లో చెల్లించడానికి చక్కెర పరిశ్రమలకు అనుమతి ఇస్తూ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ (సిఎసిపి) ప్రతిపాదనపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ ప్రతిపాదనను అఖిల భారత చెరుకు రైతలు సమాఖ్య తిరస్కరించింది. ఈ మేరకు సమాఖ్య అధ్యక్షులు డి.రవీంద్రన్, ప్రధాన కార్యదర్శి ఎన్కె శుక్లా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. చక్కెర పరిశ్రమల ప్రయోజనాలను కాపాడ్డం, రైతులపై భారం మోపడమే ఈ ప్రతిపాదన లక్ష్యమని విమర్శించారు. ఈ ఏకపక్ష, కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక ప్రతిపాదనను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదన నీతి ఆయోగ్ చర్యలకు పరాకాష్ట అని విమర్శించారు. ఈ ప్రతిపాదన అమలుతో సుమారు ఒక ఏడాది పాటు కష్టపడి చెరుకు పండించి, పరిశ్రమకు పంపించిన రైతు మరో ఆరు నెలల పాటు తన ప్రతిఫలం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.