Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతకాకపోతే పోలీస్ స్టేషన్లు మూసివేయండి
- నిరసన దీక్షలో చంద్రబాబు నాయుడు
అమరావతి : 'మా పార్టీ నాయకుడు పట్టాభి వాడిన భాష తప్పైతే మీరు మాట్లాడే భాష ఏమిటి? ముఖ్యమంత్రి, మంత్రులైతే ఏమైనా మాట్లాడవచ్చా?' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయడు అన్నారు. టీడీపీ కార్యాలయాలు, నేతల ఇండ్లపై జరిగిన దాడులకు నిరసనగా 36గంటల దీక్షను గురువారం ఆయన చేపట్టారు. 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విమర్శించే ప్రతిపక్షాలను భయపెట్టాలన్న లక్ష్యంతోనే ఈ దాడులకు దిగారని అన్నారు. ఇటువంటి దాడులకు తాము భయపెడే ప్రసక్తే లేదని చెప్పారు. చేతకాకపోతే పోలీస్ స్టేషన్లు మూసివేసుకోవాలని, తమను తామే కాపాడుకోగలమని అన్నారు.