Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరల పెరుగుదలపై బీజేపీ నేత వ్యాఖ్యలు
లక్నో: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై సమాధానం చెప్పమంటే దేశంలో మెజారిటీ ప్రజలకు అసలు పెట్రోల్ అవసరమే లేదని యూపీ చెందిన మంత్రి ఉపేంద్ర తివారి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు గురువారం జలౌన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పై విధంగా మాట్లాడారు. ''దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ.. కార్లు, బైక్‌లు చాలా తక్కువ మంది వద్ద ఉన్నాయి. పెట్రోల్ ఆ తక్కువ మందికే అవసరం. దేశంలోని 95 శాతం జనాభాకు పెట్రోల్ అవసరమే లేదు. ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగుతున్నాయి. వారికి దమ్ముంటే దేశ తలసరి ఆదాయం గురించి మాట్లాడమనండి. 2014కి ముందు ఈ దేశ తలసరి ఆదాయం ఎంత ఉండేదో, ఇప్పుడు ఎంత ఉందో చెప్పమనండి. మోడీ, యోగీ వల్ల దేశంలో తలసరి ఆదాయం రేటు గణనీయంగా పెరిగింది'' అని మంత్రి తివారి అన్నారు.