Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : వాయుసేనకు చెందిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానం గురువారం మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో కుప్పకూలింది. శిక్షణలో భాగంగా ఈ విమానం ఉదయం సెంట్రల్ సెక్టార్ నుంచి గాల్లోకి ఎగిరింది. అనంతరం కొద్ది సేపటికే భింద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మనకాబాద్ వద్ద ఖాళీ ప్రదేశంలో కూలినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలిలో విమానం తోకభాగం నేలలో కూరుకుపోయినట్టు సమచారం. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు వాయుసేన భావిస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడినట్టు ప్రకటించింది.