Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 14 వేలుగా ఉన్న కేసులు గురువారానికి అమాంతం 18 వేలకు పెరిగాయి. దాంతో క్రియాశీల కేసుల తగ్గుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం రికవరీల కంటే కొత్త కేసులే అధికంగా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. తాజాగా 12,47,506 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,454 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసుల్లో 26 శాతం మేర పెరుగుదల కనిపించింది. నిన్న 17,561 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.41 కోట్లకు చేరగా.. అందులో 3.34 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,78,831కి చేరింది. క్రియాశీల రేటు 0.52 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.15 శాతం ఉంది. నిన్న మరో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4.52 లక్షల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు.