Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్లో చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా నిత్యం చమురు ధరలను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గురువారం కూడా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీంతో పెట్రోల్ గరిష్ట ధర రూ.118.23కు చేరింది. డీజిల్ ధర రూ.109.4కు పెరిగింది. విమానయాన సంస్థలకు విక్రయించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్) కంటే ద్విచక్ర, కార్లలో ఉపయోగించే పెట్రోల్ ధరలు 33 శాతం అధికంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.79గా ఉంది.