Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లను రైతులు నిరవధికంగా దిగ్బంధించరాదు : సుప్రీం కోర్టు ధర్మాసనం
- మూడు చట్టాల ఆమోదం వెనక దురుద్దేశం
- రహదారుల దిగ్బంధం పోలీసులే చేస్తున్నారు : రైతు సంఘాల తరఫు న్యాయవాది దుష్యంత్ దవే
న్యూఢిల్లీ : రైతులకు నిరసన తెలిపే హక్కు ఉన్నదనీ, కానీ నిరవధికంగా రహదారుల దిగ్బంధనాలు సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. విషయం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ నిరసనలు తెలపడానికి తామేమీ వ్యతిరేకం కాదని పేర్కొంది. రైతులు రహదారులను దిగ్బంధించడంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ''మొత్తానికి ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉంది. న్యాయసా ్థనంలో కేసు పెండింగ్లో ఉన్నా నిరసనలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఈ రకంగా రహదారులు బ్లాక్ చేయడం సరికాదు. ప్రజలందరూ రహదారులపై హక్కు కలిగి ఉంటారు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయండి : దుష్యంత్ దవే
రహదారులను దిగ్బంధనం చేస్తున్నది రైతులు కాదని పోలీసులనీ, రైతు సంఘాల తరపు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఏ రకంగానైనా నిరసన తెలిపే హక్కు ఉంటే ఉండొచ్చు కానీ రహదారులను దిగ్బంధనం చేయకూడదని పేర్కొంది. రహదారులను ఆక్రమించొచ్చని వాదిస్తున్నారా? లేక పోలీసులు రహదారులను బ్లాక్ చేస్తున్నారనా? మీ వాదనేంటి అని దుష్యంత్ దవేను ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీ పోలీసుల ఏర్పాట్లు కారణంగా రహదారులు బ్లాక్ అయ్యాయనీ, కానీ రైతులే రహదారులను దిగ్బంధనం చేస్తున్నారనే భావన కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలని ధర్మాసనానికి దవే విజ్ఞప్తి చేశారు. రైతుల్ని పోలీసులు నిలువరించిన తరువాత, రాంలీలా మైదానంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ర్యాలి నిర్వహించిందన్నారు. ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని దుష్యంత్ దవే పేర్కొన్నారు. దీనికి పరిష్కారం ఒక్కటేనని జంతర్ మంతర్ వద్ద నిరసన చేయడానికి అనుమతి ఇవ్వాలని దవే కోరారు.
మూడు చట్టాల ఆమోదం వెనక దురుద్దేశం
రైతుల నిరసన వెనక దురుద్దేశం దాగుందని కేంద్రం తరపు సొలిసిటర్జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ''ఒక్కోసారి రైతుల నిరసన వెనక బలమైన కారణం కాకుండా మరేదే ఉందని అనిపిస్తుంది. రిపబ్లిక్ డే రోజున వారు వచ్చినపుడు చాలా తీవ్రమైన సమస్యగా మారింది'' అని తుషార్ మెహతా తెలిపారు. వెంటనే దవే స్పందిస్తూ మూడు వ్యవసాయ చట్టాలు ఆమోదించడం వెనక దురుద్దేశం కూడా అందరికీ తెలుసునని, కార్పొరేట్లకు అది మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. రైతుల సంఘాలకు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి పరిశీలన నిమిత్తం కేసు డిసెంబరు 7కు వాయిదా వేసింది. ''ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. తొలుత కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తరువాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం అవసరమైతే ఆ విషయం చెబుతాం. కౌంటరు మూడు వారాల్లో దాఖలు చేయండి. అనంతరం రిజాయిండరు దాఖలు చేయండి.