Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య శ్రీనివాస్, పవన్ కేసి, రూపిక, ఇందు ముఖ్య తారాగణంగా నటిస్తున్న చిత్రం 'చిల్ బ్రో'. అరుణోదయ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్1గా ఈ చిత్రాన్ని శ్రీను చెంబేటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ గాయని మంగ్లీ పాడిన 'గిరా..గిరా..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు సర్వత్రా అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం మాట్లాడుతూ, 'లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు కుంచం శంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పబ్లిసిటీ కంటెంట్‌కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభించింది. అలాగే తాజాగా పాపులర్ సింగర్ మంగ్లీ పాడిన 'గిరా.. గిరా.. తిరుగుతోందిరా ఊరు.. సరా సరా.. సాగుతోందిరా..' అంటూ సాగే పాట విడుదలైంది. మంగ్లీ వాయిస్‌కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెరసీ ఈ పాట విశేష ఆదరణ పొంది ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది. శ్రీను చెంబేటీకి నిర్మాతగా తొలి చిత్రమైనప్పటికీ రాజీ పడకుండా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపింది.