Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళనలు చేపడుతున్న సింఘూ సరిహద్దు వద్ద మరో వ్యక్తిపై దాడి జరిగింది. ఇటీవల ఇటువంటి దాడి జరగడం ఇది రెండవ సారి. సిక్కు మత గ్రంధాన్ని కించపరిచారన్న ఆరోపణలతో ఓ కూలీని హత్య చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వ్యక్తిపై దాడి జరిగింది. బాధితుడు మనోజ్ పాశ్వాన్ వీడియోలో చెబుతున్న ప్రకారం పౌల్ట్రీ నుండి చికెన్ తీసుకువస్తుండగా.. ఓ వ్యక్తి తనను అడ్డుకుని, చికెన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఇచ్చేందుకు నిరాకరించడంతో తనపై దాడి చేసినట్లు చెప్పారు. తాను ఇవ్వనని, ఫార్మ్ ఓనర్లకు, దుకాణాదారులకు సమాధానం తాను చెప్పుకోవాలని, తానొక కూలీ వాడినని, ఇలా చేస్తే తన ఉద్యోగం ఊడిపోతుందని చెప్పానని తెలిపారు. దీంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.