Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఐపీఎస్ అధికారులు పరంబీర్ సింగ్, రష్మి శుక్లాలకు బీమా కొరేగావ్ కమిషన్ శుక్రవారం సమన్లు జారీచేసింది. 2018, జనవరి 1న పూణేలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన ఘటనలో సాక్ష్యులుగా హాజరుకావాలని ఆదేశించింది. కోల్కతా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జెఎన్.పటేల్ ఈ కమిషన్కు నాయకత్వం వహిస్తున్నారు. బీమా కోరేగావ్ యుద్ధ స్మారకంగా జరిగిన 200వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న హింస సమయంలో పరంబీర్ సింగ్ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీగా, శుక్లా పూణే పోలీస్ కమిషనర్గా ఉన్నారు. సమన్లు నేపథ్యంలో వీరిద్దరు కమిషన్ ఎదుట వచ్చే నెల 8 లోపు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. కమిషన్ ఇప్పటి వరకు 35 మందికి పైగా సాక్ష్యులను విచారించింది. ఆధారాలు ఇంకా దొరుకుతున్నాయని, త్వరలో మరికొంత మంది ప్రభుత్వ అధికారులు, పోలీసులను విచారించే అవకాశం ఉందని కమిషన్ తరపు న్యాయవాది ఆశిష్ సత్పుట్ పేర్కొన్నారు.