Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: స్థానిక లాల్బాగ్ ప్రాంతంలోని 61వ అంతస్తుల నివాస భవనంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, పలువురు గాయపడినట్టు అధికారులు తెలిపారు. నగరంలోని లగ్జరీ వన్ అవిఘ్న పార్క్ సొసైటీలో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు 19వ అంతస్తు నుండి దూకిన అరుణ్ తివారి (30) అనే వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అవిఘ్న పార్క్ బిల్డింగ్‌లోని 19వ అంతస్థులో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయని సెంట్రల్ ముంబై అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ మంటలను ఆర్పేందుకు 12 అగ్నిమాపక యంత్రాలు, వాటర్ ట్యాంకర్లను తరలించామని అన్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పారు.