Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ల కోసం ఈ నెల 25 నుంచి దరఖాస్తు చేసుకోవొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇప్పటివరకూ ఆరు దఫాలు బాండ్లను జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లను జారీ చేస్తుంది. తాజా 2021-22 పసిడి బాండ్ల ఇష్యూ ఐదు రోజుల పాటు అమల్లో ఉంటుందని పేర్కొంది. 2022 మార్చి నాటికి నాలుగు దపాలుగా విక్రయించనున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రస్తుతం జరగబోయేది ఏడో సీరస్ అని తెలిపింది. దరఖాస్తుదార్లకు నవంబర్ 2న బాండ్లు జారీ అవుతాయని పేర్కొంది. ఈ బాండ్లను బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజీల ద్వారా విక్రయిస్తారు.