Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బులు పంచేందుకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని ఆరోపణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హుజూరాబాద్‌లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచి జమ చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నేత గట్టు రామచందర్‌రావు శుక్రవారం ఫిర్యాదు చేశారు. డబ్బులు జమచేయడం, ఓటర్ల ఖాతాలోకి నేరుగా పంపిణీకి ప్లాన్చేయడంపై ఇప్పటికే ఈటల రాజేందర్‌పై పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.