Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాలు ప్రకారం గత 24 గంటల్లో 15,786 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 231 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.41 కోట్లకు చేరుకోగా, 4,53,042 మంది మరణించారు. గురువారం 18,641 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 3,35,14,449కు చేరుకుంది. రికవరీ రేటు 98.16 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 1,75,745 యాక్టివ్ కేసులున్నాయి. క్రియా శీలక రేటు ప్రస్తుతం 0.51 శాతంగా ఉంది.