Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గుజరాత్ నూతన కాంగ్రెస్ చీఫ్ నియామకం నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్, స్వతంత్య్ర ఎమ్మెల్యే జిగేష్ మేవానీ శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీని కలిశారు. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జీపీసీసీ) ప్రెసిడెంట్‌తో పాటు ప్రతిపక్ష నేతను కూడా ఎన్నుకోనున్నారు. కాగా, ఈ సమావేశంలో హార్దిక్ పటేల్‌తో పాటు సాంకేతిక కారణాల రీత్యా పార్టీలోకి రాలేకపోయిన జిగేష్ మేవానీకి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ పాట్నాకు వెళ్లాల్సిన నేపథ్యంలో రాహుల్‌తో ముందుగా భేటీ అయినట్లు సమాచారం.
రాహుల్‌ని కలిశామని, బీహార్‌లో ఉప ఎన్నికల నేపథ్యంలో కన్నయ్య కుమార్‌తో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు పాట్నా వెళ్తున్నామని, త్వరలో సమావేశం వివరాలు తెలియజేస్తామని హార్దిక్ పటేల్ తెలిపారు. కాగా, గుజరాత్ పీసీసీ అధ్యక్షుడిగా 61 ఏండ్ల శక్తి సిన్హా గోహిల్‌ను ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గుజరాత్ కాంగ్రెస్ వర్గ పోరు, తదుపరి కార్యాచరణపై గాంధీ సీనియర్ నాయకులతో ఒక్కొక్కరితో సంభాషిస్తున్నారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ గుజరాత్ పిసిసి అధ్యక్ష పదవికి అమిత్ చవ్డా, శాసనసభ ప్రతిపక్ష నేతగా పరేష్ ధనానీ రాజీనామా చేసిన సంగతి విదితమే.