Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలేష్ యాదవ్ విమర్శనాస్త్రాలు
లక్నో: బీజేపీపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోని పెట్రోల్ అవసరం లేని 95శాతం మందికి బీజేపీ కూడా అవసరంలేదంటూ యూపీ మంత్రికి చురకలంటించారు. 95 శాతం మందికి పెట్రోల్ అవసరంలేదని, ఎందుకంటే ఖరీదైన పెట్రోల్ సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టదని బిజెపి మంత్రిగారు చెప్పారని, వాస్తవానికి, ఆ 95 శాతం మంది బీజేపీని కూడా కోరుకోవడం లేదని అన్నారు. ఇప్పుడు ఆ యూపీ మంత్రిని కూడా ప్రజలు కోరుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవల లఖింపూర్ ఖేర్‌లో రైతులను కారుతో తొక్కించిన ఘటనలో నిందితుడు, బీజేపీ కార్యకర్త మన్హీంద్ర థార్‌కు మాత్రం డీజిల్ అవసరమా అంటూ ఎద్దేవా చేశారు. రైతులను కారుతో తొక్కించేందుకు వారికి మాత్రం పెట్రోల్ అవసరమా అని ప్రశ్నించారు. కాగా, దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ.. 95 శాతం మందికి పెట్రోల్ అవసరమే లేదంటూ యూపీ మంత్రి ఉపేంద్ర తివారి గురువారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.