Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో చమురు ఉత్పత్తి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడో రోజూ ధరలు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రో ధరలు కొత్త రికార్డులను నమోదు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజీల్లపై 35 పైసల చొప్పున ధరలు పెరిగాయి. దీంతో పెరిగిన ధరల ప్రభావం వాహనదారులు, సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పెంచిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.89, డీజీల్ ధర రూ. 95.62కి ఎగబాకింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.78కు, డీజీల్ ధర రూ. 103.63కి పెరిగింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.45గా, డీజీల్ ధర రూ. 98.73గా ఉన్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.92, డీజీల్ ధర సెంచరీకి చేరువై రూ. 99.92గా నమోదైంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.61కు, డీజీల్ ధర రూ. 101.49కు ఎగబాకింది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ. 111.18కి పెరిగింది. అలాగే, ఇక్కడ లీటర్ డీజీల్ ధర రూ. 104.32కి ఎగబాకి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర సెంచరీ మార్కును దాటి పరుగులు పెడుతున్నది. ఇక 12 రాష్ట్రాల్లో డీజీల్ ధర మూడెంకెలను నమోదు చేయడం గమనార్హం.