Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో రెండు డీల్‌లను క్లియర్ చేస్తే రూ. 300 కోట్లు లంచం ఆఫర్ చేశారని తెలిపారు. కాగా, ఆ రెండు ఫైళ్లు 'అంబానీ', ఆరెస్సెస్‌కు చెందిన ఒక అధికారికి సంబంధించినవి కావడం గమనార్హం. 2018, ఆగష్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకాశ్మీర్ గవర్నర్‌గా ఆయన పదవిలో ఉన్న విషయం విదితమే. '' నేను పదవిని చేపట్టిన వెంటనే నా దగ్గరకు రెండు ఫైళ్లు వచ్చాయి. అందులో ఒకటి అంబానికి చెందినది కాగా, మరొకటి ఆరెస్సెస్‌కు చెందిన ప్రముఖ అధికారిది. అందులో స్కాం ఉన్నదని నాకు తెలిసింది'' అని మాలిక్ మాట్లాడిన ఒక వీడియోలో వెల్లడైంది. రాజస్థాన్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఈ వీడియో ట్విట్టర్లో షేర్ అయ్యింది. '' వీటిని క్లియర్ చేస్తే ఒక్కో ఫైలుకు రూ. 150 కోట్లు పొందుతారని సెక్రెటరీలు నాకు చెప్పా రు. అయితే, ఆ రెండు డీల్లనూ నేను రద్దు చేశాను'' అని ఆయన వివరించారు. కాగా, అనిల్ అంబానీకి చెందిన 'రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్' ఈ రెండు డీల్‌లలో ఒకటని సమాచారం. '' కాశ్మీర్లో అలాం టిది తాను ఏదైనా చేస్తే ఈడీ, ఐటీ విభాగాలు తన ఇంటికి వచ్చేవి. అయితే, నేను అలాంటివేమీ చేయలేదని నమ్మకంతో చెప్తాను'' అని సత్యపాల్ తెలిపారు. ఈ డీల్లకు సంబంధించిన విషయాన్ని ప్రధాని మోడీకి కూడా నేరుగా చెప్పానని మాలిక్ వివరించారు. పదవిని వదులుకునేందుకు సైతం సిద్ధమని ప్రధానికి చెప్పినట్టు తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమ య్యాయి. ప్రస్తుతం, సత్యపాల్ మాలిక్ మేఘాలయ గవర్నర్‌గా ఉన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ల పై ఆయన భూకబ్జా ఆరోపణలు చేశారు. కాగా, తన గురించి ఆరోపణలు చేసిన మాలిక్‌కు మెహబూబా ముఫ్తీ లీగల్ నోటీసు పంపారు. ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవాలనీ, రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బ తీసే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని నోటీసులో ఆమె పేర్కొన్నారు. అలాగే, రూ. 10 కోట్ల నష్టపరిహా రాన్ని చెల్లించాలని గవర్నర్‌ను ముఫ్తీ డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె తరఫు న్యాయవాది హెచ్చరించారు.