Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఈ నెల 28న మధ్యప్రదేశ్లోని నార్సింగ్ పూర్ జిల్లా గదర్వాడలో భారీ కిసాన్ మహా పంచాయత్ జరగనున్నది. ఇప్పటికే షెయోపూర్, రేవా, జబల్పూర్ జిల్లాల్లో ఇలాంటి కిసాన్ మహా పంచాయితీలు జరిగాయి. హర్యానాలో జజ్జర్ జిల్లాలోని బాద్సా గ్రామంలో ముఖ్యమంత్రి, హౌం మంత్రి, ఇతర బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా నల్లజెండాలతో ఆందోళన చేయడానికి పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. రైతులు తమ నల్ల జెండాలతో నిరసనను నాలుగు గంటలకుపైగా వేదికకు దగ్గరగా చేపట్టారు. వారు గ్రామ మార్గాలు తీసుకొని కాలువల వెంట నడిచారు. ఎందుకంటే పోలీసులు వారిని వివిధ చెక్ పాయింట్ల వద్ద అడ్డుకున్నారు. నల్ల జెండాలతో రైతుల నిరసనలను ఎదుర్కొన్నది హర్యానా సిఎం, ఇతర బిజెపి నాయకులు మాత్రమే కాదని, ప్రధాని మోడీ కూడా అని ఎస్కెఎం పేర్కొంది. లఖింపూర్ ఖేరీ మారణహౌమం టికునియా నుండి ప్రారంభించిన షహీద్ అస్థికల యాత్రలు ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో వందల కిలోమీటర్లు సాగుతున్నాయి. ఒక యాత్ర గోహానా ప్రాంతంలోని అనేక గ్రామాల గుండా సాగింది. ఇది ఇప్పుడు సోనేపట్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటుంది. మరొక యాత్ర ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కి చేరుకుంది. ఇది అక్టోబర్ 23న జలాలాబాద్ గ్రామం గుండా వెళుతుంది. అస్థికలు 24న గంగానదిలో కలుపుతారు. మరో యాత్రల్లో సిర్సా జిల్లాలోని ఇరవైకి పైగా గ్రామాలలో ప్రయాణిస్తోంది. షహీద్ అస్థికల యాత్రలు జరుగుతున్న ప్రతిచోటా, అజరు మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమరవీరుల త్యాగం వధాగా పోదని, అన్ని డిమాండ్లు సాధించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. జస్బీర్ సింగ్ విర్క్ నేతత్వంలో భారతీయ సిక్కు సంఘటన్ ఎస్కెఎంలో ఎన్నడూ భాగం కాదని, ఇప్పుడు కూడా కాదని సంయుక్త కిసాన్ మోర్చా పునరుద్ఘాటించింది.