Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద కోట్ల డోసులు సరికొత్త అధ్యాయానికి నాంది : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారిపై పోరు ఇంకా ముగియలేదు, ఎత్తిన ఆయుధాలను దించొద్దు అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొ న్నారు. దేశవ్యాపితంగా వంద కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పూర్తయిన సందర్భంగా ఆయన శుక్రవారం జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ, ''అక్టోబరు 21న దేశం 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయం దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించినది'' అని అన్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ అనేది కేవలం ఓ గణాంకం మాత్రమే కాదు, నవ భారతానికి ప్రతీక అన్నారు. ఇది దేశంలో నూతన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. వంద కోట్ల డోసులు అందరికీ ఉచితంగా అందించామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మనల్ని ప్రశంసిస్తున్నాయన్నారు.. విఐపి సంస్కతి వల్ల సామాన్యులకు వ్యాక్సిన్ అందని పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రపంచంలో అభివద్ధి చెందిన అనేక దేశాల్లో ఇప్పటీకి వ్యాక్సిన్ను వేయించుకోలా, వద్దా? అనే ఊగిసలాట కొనసాగుతోందని, అయితే భారతదేశ ప్రజలు 100 కోట్ల టీకా డోసులను వేయించుకోవడం ద్వారా దీనికి జవాబు చెప్పారని ప్రధాని మోడీ అన్నారు. పండగల సందర్భంగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, ఈ విషయంలో ఏమరపాటు తగదని అన్నారు. భారత వ్యాక్సిన్ కార్యక్రమం సైన్స్ నుంచి, సైన్స్ ద్వారా, సైన్స్ ఆధారంగా సాగిందని ప్రధాని పేర్కొన్నారు.