Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల వేదిక పేటియం పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ రెగ్యూలేటర్ సెబీ అనుమతి లభించింది. ఈ ఐపీఓతో దాదాపు రూ.16,600 కోట్లు సమీకరించాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలువనుందని ఆ సంస్థ శుక్రవారం పేర్కొంది. నవంబర్ మధ్య నాటికి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. దీనిపై పేటియం స్పందించడానికి నిరాకరించింది. ఈ ఐపీఓ విజయవంతం అయితే ఇంతక్రితం 2013లో కోల్ ఇండియా రూ.15వేల కోట్ల ఇష్యూ రికార్డును చెరిపివేయనుంది. పేటియం విలువ రూ.1.4- 1.78 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. సెబీకి ప్రతిపాదించిన ప్రాస్పెక్టస్ ప్రకారం రూ. 8,300 కోట్ల విలువైన ఈక్విటీని ఐపీఓలో భాగంగా జారీ చేయనుంది. మరో రూ.8,300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విజరు శేఖర్ శర్మతోపాటు చైనీస్ గ్రూప్ అలీబాబా, తదితర సంస్థలు వాటాలను ఆఫర్ చేయనున్నాయి.