Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత రాజకీయ,ఆర్థిక సామాజిక అంశాలపై చర్చ
- కోవిడ్ నిబంధనలతో మూడు రోజులపాటు నిర్వహణ..
న్యూఢిల్లీ: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగబోయే ఈ సమావేశాలు శుక్రవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో పొలిట్ బ్యూరో సభ్యులు బిమన్ బసు అధ్యక్షత వహించారు.కరోనా పరిస్థితుల తరువాత తొలిసారి భౌతికంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలు జరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై చర్చించను న్నారు. అలాగే సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభల నివేదికాంశాలపై చర్చ జరగనున్నది. తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య హాజరయ్యారు. ఏపీ నుంచి పి. మధు, వి.శ్రీనివాసరావు, ఎంఎ గఫూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ధరల పెరుగుదల తీవ్రమైన సమస్యగా ఉన్నదనీ, కరోనాలో సహాయం చేయాల్సింది పోయి, కేంద్రం ఉన్నది కూడా లాక్కుంటుందని విమర్శిం చారు. అదానీ, అంబానీలకు మేలు చేసేలా కేంద్రం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రైతు సమస్యలు, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.