Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆదాయ పన్నుల కొత్త వెబ్ పోర్టల్‌లో దాదాపు 12 గంటల పాటు అంతరాయం చోటు చేసుకోనుంది. నిర్వహణ పరమైన పనుల్లో భాగంగా శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం తన వెబ్సైటులో తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో కొత్త పోర్టల్‌ను పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగించారు.