Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రేటింగ్ ఎజెన్సీ ఇక్రాలో అనుహ్యా పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, ఎండి ఎన్ శివరామన్ రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని శివరామన్ శనివారం వెల్లడించారు. గ్లోబల్ ఎజెన్సీ మూడీస్లో ఇక్రా ఓ యూనిట్‌గా ఉంది. 2020 జులైలో ఆయన ఇక్రాలో చేరారు. కాగా నూతన ఎండి, సిఇఒగా రామ్‌నాథ్ క్రిష్ణన్ నియమితులైనట్లు ఇక్రా తెలిపింది. ప్రస్తుతం క్రిష్ణన్ ఇక్రాలో చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆయన కూడా 2020 జులైలో ఈ సంస్థలో చేరారు. ఇంతక్రితం 2018 నుంచి ఆర్బిఎల్ బ్యాంక్‌లో చీఫ్ రీస్క్ ఆఫీసర్‌గా పని చేశారు. శివరామన్ ఇక్రాలో చేరకముందు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేశారు.