Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవా ప్రజలకు మోడీ విజ్ఞప్తి
పనాజీ: గోవా స్వయం సమృద్ధికి మరోసారి 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ' ఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా ప్రోగ్రామ్' లబ్ధిదారులు, భాగస్వాములతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌తో ద్వారా మోడీ సంభాషించారు. ఈ సందర్భంగా మోడీ ఈ విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలను 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వంగా మోడీ అభివర్ణిస్తుంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ఉన్న గోవాలో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. 'అభివృద్ధి మార్గాలను, అవకాశాలనూ వందశాతం ఉపయోగించుకున్నప్పుడే గోవా పూర్తి స్వయం సమృద్ధిని సాధిస్తుందని' మోడీ తెలిపారు. స్వయంపూర్ణ గోవా కార్యక్రమం ద్వారా మహిళలకు ఆరోగ్యం, యువతకు, నిరుద్యోగులకు ఉపాధి హామీ లభిస్తుందని మోడీ తెలిపారు. గోవాలో ప్రతీ వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడానికి ఈ కార్యక్రమం సహకారం అందిస్తుందని మోడీ చెప్పారు.