Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై కేంద్రం భారీమొత్తంలో ఎక్సైజ్ సుంకం విధించటం సరైందేనని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ప్రజలకు ఉచిత బియ్యం, వంటగ్యాస్, కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నామని, ఇంధనంపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బుతోనే ఈ కార్యక్రమాలన్నీ అమలుజేస్తున్నామని చెప్పారు. ఇంధన ధరలపై పన్నులు తగ్గించాలని రాజకీయ విమర్శలు చేయటం చాలా తేలికని, అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నా, ఇక్కడ మాత్రం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియా ఎనర్జీ ఫోరం ఇండిస్టీ' అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..''దేశవ్యాప్తంగా 100కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశాం. గత ఏడాది కాలంగా 90కోట్లమందికి ఆహారాన్ని అందజేస్తున్నాం. 8కోట్లమంది లబ్దిదారులకు ఉజ్వల పథకం ద్వారా ఉచిత వంటగ్యాస్ ఇస్తున్నాం. పెట్రోల్, డీజిల్పై కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ పన్ను రూ.32తోనే ఈ పథకాలన్నీ అమలుజేస్తున్నాం. పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. రోడ్లు, భవనాలు కడుతున్నాం. అనేక సంక్షేమ పథకాలు అమలుజేస్తున్నామంటే దానికి ఆధారం ఈ పన్నులతో వచ్చే ఆదాయమే'' అని అన్నారు. పన్నులు తగ్గించాలని, ధరలు తగ్గించాలని డిమాండ్ చేయటం సులువు. రాజకీయ విమర్శలు చేయటం తేలిక..అని కేంద్రమంత్రి ప్రతిపక్షాల్ని దృష్టిలో పెట్టుకొని ఎద్దేవా చేశారు.కొద్ది రోజుల క్రితం పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి కూడా ఇంధన ధరల పెంపును సమర్థించారు.పెట్రోల్, డీజిల్పై కేంద్రం విధిస్తున్న భారీ పన్నులు సరైందేనని అన్నారు. పన్నులు విధించటం వల్లే ఇంధన ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నాయని, ఉచిత వ్యాక్సిన్ అమలుజేస్తున్నామంటే..దానికి డబ్బులు ఎక్కడ్ను ంచి వస్తున్నాయో తెలియదా? అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పెట్రో వడ్డన ఆగదా?
గతకొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచుతూ పోతోంది. వరుసగా నాలుగోరోజు శనివారం లీటర్ పెట్రోల్, డీజిల్పై 35పైసల దాకా పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ ధర రూ.95.97కు చేరుకున్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.12, డీజిల్ రూ.104కు పెరిగాయి. రాజస్థాన్లోని గంగానగర్లో పెట్రోల్ అత్యధికంగా రూ.119.42, డీజిల్ ధర రూ.110.26కు చేరుకున్నాయి. శనివారం నాటి పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55, డీజిల్ ధర రూ.104.70 వద్ద కొనసాగుతోంది. సెప్టెంబర్ 28 తర్వాత ఇంధన ధరలు 19సార్లు పెరిగాయి.