Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రాజకీయపార్టీలు, బలమైన ప్రభుత్వాలు సోషల్ మీడియాలో పౌరులను నియంత్రిస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయని నోబెల్ అవార్డు గ్రహీత జర్నలిస్టు మరియా రెస్సా అన్నారు. ఈ ఏడాది నోబెల్ అవార్డు పొందిన ఇద్దరు జర్నలిస్టుల్లో ఫిలిప్పిన్స్కు చెందిన మరియా రెస్సా ఒకరు. ఫిలిప్పిన్స్ ప్రభుత్వం, 'బిగ్ టెక్' సోషల్ మీడియా కంపెనీలతో పోరాటం సాగిస్తున్న మరియా రెస్సా 'హౌ టూ స్టాండ్ అప్ టు ఎ డిక్టేటర్' అనే పుస్తకంలో ఈ విషయాలను వివరించారు. ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్లూలో భాగంగా సోషల్ మీడియాతో పాటు పలు అంశాలపై ఆమె స్పందించారు. తనకు వచ్చిన నోబెల్ బహుమతి ప్రపంచంలోని జర్నలిస్టులందరిదని చెప్పారు. దశాబ్దం క్రితమే జర్నలిస్టులు తమ 'గేట్కీపీంగ్ పవర్స్'ను సోషల్ మీడియాకు కోల్పోయారని ఆమె తెలిపారు. మెయిన్ స్ట్రీం మీడియాలో నమ్మకం సన్నగిల్లడానికి దారి తీసిన సోషల్ మీడియా వినియోగాన్ని మనం చూశామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పౌరులందరూ పార్టీల ద్వారా నియంత్రించబడితే, వారు ప్రతీదీ అపనమ్మకంతో చూడటం మొదలుపెడతారని తెలిపారు.