Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేరళ స్థానిక సంస్థల పరిపాలన, ఎక్సేజ్ మంత్రి, ఏఐఎడబ్ల్యుయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.వి గోవిందన్ మాస్టర్ అభినందన సభ జరిగింది. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన సందర్భంగా ఆదివారం నాడిక్కడ క్యానింగ్ లైన్ 36లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో వివిధ సంఘాల వక్తలు మాట్లాడారు. తొలుత కేరళ ఎల్డిఎఫ్ చైర్మెన్, ఎఐఎడబ్ల్యుయు జాతీయ అధ్యక్షుడు ఎ. విజయరాఘవన్ మాట్లాడుతూ కేరళ అన్ని రంగాల్లో దేశానికి మోడల్‌గా ఉందని అన్నారు. నూతన కేరళ నిర్మాణమే తమ లక్ష్యమని, ఉపాధి అందించడం, పరిశ్రమల అభివద్ధి చేయడమని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ చేస్తున్న దానికి ప్రత్యామ్నాయంగా శ్రామిక కేరళను నిర్మిస్తామని స్పష్టం చేశారు. మంత్రి ఎం.వి గోవిందన్ మాస్టర్ మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కోవడానికి వ్యతిరేకంగా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపి వి.శివదాసన్, ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, ఉపాధ్యక్షుడు అమ్రారామ్, సహాయ కార్యదర్శలు విజూకృష్టన్, ఎన్‌కె శుక్లా, ఎఐఎడబ్ల్యుయు నేత విక్రమ్ సింగ్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు విపి సాను, డిఎస్‌ఎంఎం నేత నత్తు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.