Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హర్యానాలో 200 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హర్యానాలోని భివానీలో రాష్ట్ర మంత్రి జేపీ దలాల్ రైతుల ఆగ్రహాన్ని చవిచూశారు. నల్లజెండాలతో రైతులు నిరసన తెలిపారు. 50 మందికి పైగా రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఎస్కెఎం డిమాండ్ చేసింది. హర్యానా బిజెపి, జెజెపి మంత్రులు, నాయకులు తమ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నప్పుడు వారి మార్గాన్ని అడ్డుకున్నందుకు ఎలెనాబాద్లో 200 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో అనేక షహీద్ కిసాన్ ఆస్తి కలశ యాత్రలు జరుగుతున్నాయి. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలోని ఉల్లూరుపేట మీదుగా సాగిన యాత్ర పెరంబలూరులోకి ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో సంగంలో అమరవీరుల చితాభస్మాన్ని కలిపారు.