Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ప్రజల జీవన్మరణ సమస్యలపై ఐక్య పోరు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు అన్నారు. ఢిల్లీలోని హరి కిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో మూడు రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా తీవ్రతను తక్కువ చేసేందుకు, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేసినట్టు భ్రమలు సృష్టించడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. వంద కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని చెబుతున్నారని, కానీ వాస్తవానికి రెండు డోసులు వ్యాక్సినేషన్ కేవలం 25 శాతమేనని అన్నారు. 18 ఏండ్లలోపు వారికి అసలు వ్యాక్సిన్ ఇవ్వలేదని అన్నారు. అలాగే గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యాన్ని అందించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారానికి పూనుకుంటుందని విమర్శించారు. వ్యాక్సినేషన్లో మోడీ సర్కార్ విఫలమైందన్నారు. దేశంలో ఉపాధి బాగా పడిపోయిందని అన్నారు. అలాగే దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై పెరిగిన పన్నులను వ్యాక్సినేషన్‌కు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెప్పడం దారుణమని, ఇంత కంటే హాస్యాస్పద విషయం మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలిస్తూ, మరొకవైపు సామాన్యులపై (పెట్రోల్, డీజిల్) వేసిన పన్నులను వ్యాక్సినేషన్‌కు ఖర్చు పెట్టడం దారుణమన్నారు. అలా అయితే అసలు వైద్య రంగం బడ్జెట్ ఏమైనట్టు? అని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అక్టోబర్ 28న ఆందోళనలు చేస్తామని తెలిపారు.అన్ని రాష్ట్రాల్లో వామపక్షాలు, ప్రజాతంత్ర పార్టీలతో కలుపుకొని పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించినట్టు చెప్పారు. వచ్చే కేంద్ర కమిటీ సమావేశంలోపు అఖిల భారత మహాసభలకు సమర్పించే నివేదిక ముసాయిదాకు తుది రూపం ఇవ్వాలని కేంద్ర కమిటీలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
రైతుల పోరాటానికి మద్దతు
రైతుల పోరాటం నవంబర్ 26 నాటికి ఏడాది పూర్తవుతుందని,ఈ సందర్భంగా నెల మొత్తం వ్యవ సాయ చట్టాల ఉపసంహరణ కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులను జయప్రదం చే యాలని నిర్ణయించినట్టు వి.శ్రీనివాసరావు చెప్పారు.