Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే రికార్డు గరిష్టానికి ఇంధన ధరలు చేరినప్పటికీ.. ఇంకా పెట్రో బాదుడు ఆగడం లేదు. వరుసగా ఐదో రోజూ సైతం పెట్రోల్, డీజిల్‌పై చమురు కంపెనీలు ధరలను పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.107.59కి చేరగా, డీజిల్ ధర రూ.96.32కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ రూ.113.46, డీజిల్ రూ.104.38కి చేరింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.11, డీజిల్ రూ.99.43, చెన్నైలో పెట్రోల్ రూ.104.52, డీజిల్ రూ.100.59కి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చమురు ధరలు చుక్కలనంటాయి. తాజాగా హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 37పైసలు, లీటరు డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. దీంతో నగరంలో లీటరు పెట్రోల్ రూ.111.91, డీజిల్ రూ.105.08గా ఉన్నాయి. గత నెల 28 నుంచి నేటి వరకు 21 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు సైతం గత నెల 24 నుంచి ఆదివారం వరకు 24 సార్లు ధరలు పెరిగాయి. ఇలా నిత్యం చమురు ధరలు పెరుగుతూ వినియోగదారుల నడ్డివిరుస్తున్నాయి. పెట్రోల్ ధరల ప్రభావం ఇతర నిత్యావసరాలపై కూడా పడటంతో సమాన్య ప్రజానీకంపైనా ఆర్థిక భారం పడటంతో లబోదిబో మంటున్నారు. దేశంలోని వాహనదారులతో పాటు ప్రతిపక్ష నాయకులు సైతం పెట్రోల్‌పై విధిస్తున్న పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.