Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్యన్‌ఖాన్ విడుదలకు ఎన్‌సిబి అధికారి, ఇతరుల డిమాండ్
- డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సంచలన ఆరోపణలు
- మలుపులు తిరుగుతోన్న డ్రగ్స్ వ్యవహారం
ముంబయి : ముంబయి డ్రగ్స్ కేసు వ్యవహారం కొత్తమలుపులు తిరుగుతోన్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో స్వతంత్ర సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి ఆదివారం దర్యాప్తు సంస్థ ఎన్‌సిబిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేసేందుకు ఒక ఎన్‌సిబి అధికారితో పాటు పలువురు ఇతరక వ్యక్తులు బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ నుంచి రూ.25 కోట్ల మేర లంచం డిమాండ్ చేశారని అన్నారు. తనను కూడా తొమ్మిది నుంచి పది ఖాళీ పేపర్లపై సంతకాలు చేయాలని అధికారులు ఒత్తిడి చేశారని మీడియాకు చెప్పారు. అయితే ప్రభాకర్ అరోపణలను ఎన్‌సిబి అధికారులు ఖండిస్తున్నారు. అవి పూర్తిగా నిరాధారమైనవని, తప్పుదోవ ఈ కేసులో పరారిలో ఉన్న గోసవీ దర్యాప్తు సంస్థ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడిచిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. మొత్తం రూ.18 కోట్లకు బేరం కుదరిందని, అందులో రూ.8 కోట్లు ఎన్‌సిబి విచారాణాధికారి సమీర్ వాంఖడేకు ఇవ్వాల్సి ఉంటుందని ప్రైవేటు డిటెక్టివ్ గోసవి ఫోన్లో శామ్ డిసౌజాతో చెప్పడం తాను విన్నట్లు సాక్షి ప్రభాకర్ చెప్పారు. ఈ సంభాషణ తర్వాత గోసవి, డిసౌజా, షారుఖ్‌ఖాన్, పూజా దద్లాని ఒక కారులో కూర్చొని 15 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కేసులో ఎన్‌సిబి తనతో బ్లాంక్ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందని ఆరోపించాడు.
షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ అరెస్టయిన ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో తొమ్మిది మందిని ఎన్‌సిబి సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేటు డిటెక్టివ్ కెపి గోసవి ఒకరు. ఇందులో భాగంగా గోసవి బాడీగార్డుగా చెప్పుకుంటున్న ప్రభాకర్ సెయిల్‌ను ఎన్‌సిబి విచారించింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ సెయిల్ ఎన్‌సిబి దాడులతోపాటు ఈ డ్రగ్స్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్‌సిబి జోన్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నుంచి ప్రాణాపాయం పొంచి ఉందని ఆరోపించారు. క్రూజ్‌పై దాడి జరిగిన తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నాడు . వీటికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ నార్కొటిక్ డ్రగ్స్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు మరిన్ని మలుపులకు దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆర్యన్‌ఖాన్‌తో గోసవి సంబంధంపై ఎన్‌సిబి దృష్టిపెట్టింది. ప్రస్తుతం గోసవి పరారీలో ఉండటంతో ఆయనపై ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకే..
ఎన్‌సిబిపై శివసేన ఎంపి సంజరురౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారి నుంచి ఎన్‌సిబి డబ్బులు అడుగుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. తెల్లకాగితాలపై ఎన్‌సిబి సాక్షుల సంతకాలు తీసుకుంటోందని రౌత్ ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాల్సే పాటిల్‌ను కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సిఎం ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నారని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఇందులో ఎన్‌సిబి కార్యాలయంలో గోసవి ఆర్యన్‌ఖాన్ చేత ఫోన్లో మాట్లాడిస్తున్నట్లు ఉంది. ప్రభాకర్ సెయిల్ ఆరోపణలు చేసిన కాసేపటికే సంజరు రౌత్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్‌సిబి
కాగా, ప్రభాకర్ ఆరోపణలను ఎన్‌సిబి తోసిపుచ్చింది. ఒకవేళ ముడుపుల వ్యవహారం జరిగితే కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంకా జైలులోనే ఎందుకుంటారని, దర్యాప్తు కార్యాలయంలో సిసి కెమెరాలు ఉన్నాయని, అటువంటి సంఘటనలు జరిగే ఆస్కారమే లేదని, కేవలం దర్యాప్తు సంస్థ ఇమేజ్ను దెబ్బతీయడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎన్‌సిబి అధికారులు పేర్కొంటున్నారు.