Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివకాశి : అగ్గి పెట్టె ధర రూ.1 పెరగనుంది. ఇప్పటివరకు రూ.1కి విక్రయిస్తున్న అగ్గిపెట్టెను డిసెంబరు 1 నుంచి రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థలు ప్రకటించాయి. దీంతో అగ్గి పెట్టె ధరలు 14 ఏండ్ల తరవాత పెరగనున్నాయి. అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై, ధరలు పెంచాలని నిర్ణయించాయి. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని సంఘాలు వివరించాయి. పెెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు భారమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270-300కి తయారీదార్లు విక్రయిస్తుండగా, ఇకపై రూ.430-480కి పెంచాలని నిర్ణయించినట్టు నేషనల్ స్మాల్ మ్యాచ్బాక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ కార్యదర్శి వి.ఎస్.సేతురథినమ్ తెలిపారు. దీనికి అదనంగా 12 శాతం జీఎస్టీ, రవాణా ఛార్జీలు కూడా ఉంటాయన్నారు. తమిళనాడులో అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా.