Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుల్తాన్పూర్ : ఎన్నికల నేరాలకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరయింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో అమేధీలోని గౌరీగంజ్, ముసఫీర్ ఖానా పోలీస్ స్టేషన్లలో కేజ్రీవాల్‌తో పాటు ఇతర ఆప్ నేతలపై రెండు కేసులు నమోదయ్యాయి. మత సామరస్యానికి విఘాతం కలిగించడం, ఇతర ఎన్నికల నేరాల ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. సోమవారం చట్టసభల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజారు చేసింది. కోర్టు ముందు సోమవారం స్వయంగా కేజ్రీవాల్ హజరయిన తరువాత జడ్జి పికె జయంత్ బెయిల్ మంజూరు చేశారు. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేశారు.