Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1975 తర్వాత ఏడోసారి ఆలస్యంగా వీడిన రుతుపవనాలు : ఐఎండీ
న్యూఢిల్లీ: దేశం నుంచి నైరుతి రుతుపవనాలు సంపూర్ణంగా తిరోగమించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. 1975 తర్వాత మళ్లీ ఇప్పుడు మొత్తంగా ఏడోసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా తిరోగమించాయని పేర్కొంది. 2010-21 మధ్య ఐదుసార్లు.. 2017, 2010, 2016, 2020, 2021 సంవత్సరాల్లో అక్టోబర్ 25, ఆ తర్వాత తిరోగమించాయని తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 6న పశ్చిమ రాజస్థాన్, గుజరాత్లో తిరోగమించడం ప్రారంభమైంది. 1975 అత్యంత ఆలస్యంగా తిరోగమించడం ఇది రెండోసారి. వాయువ్య భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. రుతుపవనాల ఉపసంహరణ గత సంవత్సరం సెప్టెంబర్ 28న, 2019 అక్టోబర్ 9న, 2018 సెప్టెంబర్ 29న, 2017లో సెప్టెంబర్ 27న, 2016లో సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల్లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతూ ఉంటుందనీ, వరుసగా మూడోసారి దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో వైపు దిగువ ఉష్ణ మండల స్థాయిల్లో ఈశాన్య గాలులు ఏర్పడడంతో.. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభయ్యాయని వాతావరణ పేర్కొంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని ఐఎండీ పేర్కొంది.