Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్ అమాత్యుల తీరుపై చర్చ
భోపాల్ : వెబ్ సిరీస్ 'ఆశ్రమ్' పేరు మార్చాలని భజరంగ్‌దళ్ చేస్తున్న అరాచకాలను మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సమర్థించారు. దర్శక నిర్మాతలు ఎప్పుడూ హిందువులు మత విశ్వాసాలను దెబ్బతీయానికే ప్రయత్నిస్తుంటారని విమర్శించారు. భజరంగ్‌దళ్ వ్యక్తులు ఆశ్రమ్ సెట్లను నాశనం చేసి, దాని దర్శక-నిర్మాత ప్రకాశ్ ఝాపై సిరా పూసిన ఒక రోజు తరువాత మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 'సినీ దర్శక నిర్మాతలు ఎందుకు ఎల్లవేళాల హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసే అంశాలనే ఎంచుకుంటారు? ఇతర మతాలపై సినిమాలను తీయడానికి ఎందుకు ధైర్యం చేయరు? తరువాత జరిగే పరిణామాలను వారు అర్ధం చేసుకున్నారు' అని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.భోపాల్‌లోని పాత సెంట్రల్ జైల్ వద్ద ఆశ్రమం సెట్లపై ఆదివారం భజరంగ్ దళ్ సభ్యులు దాడి చేశారు. సెట్లలో సామాగ్రితో పాటు, రెండు బస్సులను ధ్వంసం చేశారు. దర్శక, నిర్మాత ప్రకాష్ ఝాపై సిరా పూసారు. ఈ దాడిలో ఒక వ్యక్తి గాయపడినట్లుగా సమాచారం.