Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీలోని 'సెంట్రల్ విస్టా' ప్రాజెక్టు కోసం కొన్ని ప్రాంతాలలో భూమి వినియోగానికి సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదిత మార్పులను సవాలు చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని కేటాయించింది. రాజీవ్ సూరీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఏ.ఎం.ఖాన్విల్కర్, సీ.టీ. రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సెంట్రల్ విస్టాకు చెందిన ఒకటో ప్లాట్లోని భూమి వినియోగాన్ని '' రిక్రియేషనల్ స్పేస్ (వినోదభరిత ప్రాంతం)''నుంచి'' రెసిడెన్షియల్ ఏరియా (నివాసిత ప్రాంతం)''గా మార్చు తూ కేంద్రం ప్రతిపాదించిందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. '' భూమి వినియోగానికి సంబంధించి ప్రతిపాదిత మార్పుతో ఢిల్లీ నివాసితులు, భారత పౌరులు సెంట్రల్ విస్టాలో అత్యంత విలువైన బహిరంగ, పచ్చటి ప్రదేశాలను విస్తృతంగా కోల్పోతారు. జీవించే హక్కు.. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించే హక్కునూ కలిగి ఉంటుంది'' అని సంజరు సూరీ వివరించారు. అయితే, ఈ ప్లాట్ ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అధికారిక నివాసాల కోసం ఉద్దేశించినదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రిక్రియేషనల్ స్పేస్‌ను వేరొక చోటుకు తరలిండంపై భద్రతా కారణాలను ఆయన లేవనెత్తారు. భూమి వినియోగాన్ని బస్ టెర్మినల్, నైబర్‌హుడ్ పార్క్ నుంచి 'అధికారిక నివాసాల'కు మార్చుతూ చేసిన ప్రతిపాదన ఆవశ్యకతపై షార్ట్ అఫిడవిట్ సమర్పించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.