Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ప్రధాని మోడీ
వారణాసి : ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌ను ప్రధాని మోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజవర్గంలో సోమవారం ప్రారంభించారు. ఈ మిషన్‌తో దేశంలో ఆర్యోగ రంగంలో మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. అలాగే ప్రధాని మోడీ తన నియోజకవర్గంలో రూ.5,200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనేది దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక, క్లిస్టమైన ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినది. ముందుగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 17,788 ఆరోగ్య కేంద్రాలకు దీని ద్వారా మద్దతు ఇస్తారు. తరువాత దేశవ్యాప్తంగా 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు అన్ని జిల్లాలోనూ అత్యంవసర సేవా సర్వీసులను ఏర్పాటు చేయనున్నారు. అన్ని పరీక్షల కోసం పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ మిషన్ కింద ఆరోగ్యంపై ఒక జాతీయ సంస్థను, వైరాలజీపై నాలుగు నూతన జాతీయ సంస్థలను, డబ్ల్యూహెచ్ఓ సౌతీస్ట్ ఆసియా రీజన్ కింద ఒక ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని, తొమ్మిది బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రయోగశాలలను, వ్యాధుల నియంత్రణకు ఐదు నూతన ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.