Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
న్యూఢిల్లీ : చారిత్రాత్మక రైతు ఉద్యమం ప్రారంభమై నేటీ (మంగళవారం)కి 11 నెలలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చింది. మండల, జిల్లా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళనలు జరుగుతాయి. కేంద్ర హౌం సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీని అరెస్టు చేసి, కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించాలనే డిమాండ్ చేస్తారు. ఈ నిరసనలు సందర్భంగా జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్ల, రాష్ట్రపతి వినతి పత్రం అందజేస్తారు. రైతుల ఉద్యమానికి బలమైన మద్దతుదారు, ఎన్ఆర్ఐ దర్శన్ సింగ్ ధాలివాల్ చికాగో నుండి వచ్చిన ఆయనను దేశంలోకి ప్రవేశించడానికి మోడీ ప్రభుత్వం అడ్డుకుందని ఎస్కేఎం పేర్కొంది. అతను దేశంలోకి రావడానికి అనుమతించకుండా తిరిగి పంపించేశారు. మోడీ ప్రభుత్వం అప్రజాస్వామిక, నిరంకుశ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్కేఎం పేర్కొంది. రైతుల ఉద్యమానికి పెరుగుతున్న బలం, మద్దతు విషయంలో బిజెపి ప్రభుత్వం వైఖరిని స్పష్టం అవుతుందని విమర్శించింది.
ఉత్తరప్రదేశ్లో ప్రధాని, హౌం మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేసినందుకు చాలా మంది రైతులపై కేసులు నమోదు చేశారు. అటువంటి కేసులన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో షహీద్ కిసాన్ అస్థి కలష్ యాత్రలు జరుగుతున్నాయి. తమిళనాడు యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. హర్యానాలోని పానిపట్ జిల్లా గుండా యాత్ర సాగింది. పంజాబ్లోని ఒక యాత్ర మాన్సా, భటిండా, ఫిరోజ్పూర్లకు చేరుకోగా, మరొక యాత్ర ఫగ్వారా, కిరాత్పూర్ సాహిబ్ మీదుగా ప్రయాణించింది. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా గుండా యాత్ర సాగింది.