Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ మరొక హామీ ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలందరికీ రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోమవారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన, చౌకగా వైద్య చికిత్స అందించే అంశాన్ని తమ మ్యానిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఎంత దుర్భరంగా ఉందో ప్రతీ ఒక్కరు చూశామన్నారు. ఇప్పుడు జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. తమ పార్టీని గెలిపిస్తే ఏ వ్యాధికైనా రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.