Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచ కప్ సూపర్ 12 దశలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపో యిందనే నెపంతో తమపై కొందరు దాడులకు పాల్ప డ్డారని జమ్మూకాశ్మీర్‌కు చెందిన పలువురు విద్యార్థులు ఆరోపించారు. వివరాల్లోకెళ్తే.. పంజాబ్‌లోని సంగ్రూర్ భారు గురుదాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పలువురు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలవ్వడంతో తమపై పలువురు దాడి చేశారని జమ్మూకాశ్మీర్ విద్యార్థులు ఆరోపించారు. ఈ దాడికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓ కాశ్మీర్ విద్యార్థి దాడి గురించి వివరిస్తూ.. 'మేము ఇక్కడ మ్యాచ్ చూస్తున్నాం.. యూపీకి చెందిన విద్యార్థి అడ్డుపడ్డాడు.. మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం.. మే కూడా భారతీయులమే.. మాకు ఏమి జరిగిందో మీరు చూడండి... మేము భారతీయులం కాదా? మోడీ ఏం చెబుతారు?' అని అతడు నిలదీశాడు. గదిలో వస్తువులను పడేసి పగలుగొట్టారని ఆరోపించాడు. దాడికి సంబంధించిన వీడియోలను విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హాస్టల్ గదుల్లోని కుర్చీలు విరిగిపోయి, బెడ్స్ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. ఒకరిపై ఒకరు చేయిచేసుకుంటున్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.