Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
తిరువనంతపురం: మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను కేరళలో ప్రారంభిస్తున్నట్టు మంగళవారం ఆరాష్ట్ర ముఖమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీరిపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను ప్రాధాన్యత క్రమంలో విచారించాలని తీర్మానించాం. ఇప్పట్లో మరే కొత్త కోర్టులను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదు'' అని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కోర్టుల ఏర్పాటుపై శాసనసభ్యుడు జేవియర్ రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తిన ప్రశ్నకు గానూ.. సీఎం ఈ విధంగా సమాధానమిచ్చారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2018-2020లో రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి 32,000 కేసులు నమోదయ్యాయి.