Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ట్వీట్‌తోనే ఖేల్‌రత్న పేరు మార్పు!
- ఆర్టీఐ సమాధానంలో వెల్లడి
న్యూఢిల్లీ : ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మార్చామని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ చేస్తున్న ప్రచారం ఒట్టిదేనని తేలింది. పేరు మార్పునకు సంబంధించి ప్రధాని మోడీ ఈ ఏడాది ఆగస్టు 6న ట్వీట్ మేరకే పేరు మార్చినట్లు ఆర్టీఐ సమాధానం ద్వారా వెల్లడైందని ది వైర్ తెలిపింది. మోడీ చెబుతున్నట్లుగా ఖేల్‌రత్న పేరు మార్చాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు సంబంధించిన వివరాలను ఇవ్వడంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విఫలమైంది. అటువంటి అభ్యర్థనకు సంబంధించిన పత్రాలు తమ వద్ద ఏమీ లేవని అధికారింగా అంగీకరించింది. ప్రధానికి వచ్చిన ఏ లేఖ అయినా సంబంధిత శాఖకు లేదా విభాగానికి బదిలీ అవుతుందని, అయితే పేరు మార్పు విషయం లో అటువంటివేమీ రాలేదని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టోక్యో ఒలంపిక్స్‌లో పురుషుల హాకీ టీం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఈ నేపథ్యంలో ఖేల్‌రత్న పేరును మార్పునకు కేంద్ర నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ ప్రధాని మోడీనే దేశంలోనే మొదటి వ్యక్తిగా ట్వీట్ చేశారు. పేరు మార్చాలని కోరుతూ పీఎంఓకు ప్రజల నుంచి ఎన్ని అభ్యర్థనలు వచ్చాయో తెలపాలంటూ ది వైర్ ఆగస్టు 8న ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని క్రీడా శాఖ ఉన్నతాధికారి, సీపీఐఓ శాంత శర్మ పేర్కొన్నారు.