Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయోద్యమ నాయకుల స్ఫూర్తితో ముందుకు : వ్యవసాయ కార్మిక సంఘం
- జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
- రైతాంగ ఉద్యమంలో భాగంగా
- పంజాబ్‌లోని లోధియానని సుఖదేవ్ ఇల్లు సందర్శించిన జాతీయ నేతలు
న్యూఢిల్లీ : భారత జాతీయోద్యమ చరిత్రలో విప్లవాత్మక పాత్ర పోశించి, తమ సమరశీల పోరాటాలతో స్వాతంత్య్ర ఉద్యమాన్ని మూల మలుపు తిప్పి నేటికీ భారత దేశ ప్రజలలో స్ఫూర్తి నింపుతున్న భగత్ సింగ్ సహచరుడు సుఖదేవ్ నివసించిన ఇల్లును మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లాంటి యువ కిశోరాలు అసమాన త్యాగాలు చేశారని అన్నారు. వారి అమరత్వంతో నాడు దేశ ప్రజలు, యువత పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. నాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం ఈ దేశ ప్రజలందరినీ పోరాట యోధులుగా మలిచిందని అన్నారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాటి సామ్రాజ్యవాదులు లాగే ప్రజా ఉద్యమాలను, ప్రజాతంత్ర హక్కులను హరిస్తూ, కుట్రలు కుతంత్రాలతో ప్రజా పోరాటాలను అణిచి పెట్టాలని ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్‌లను ఉరి తీసి చంపడం ద్వారా ఉద్యమాన్ని అణచి పెట్టాలని ప్రయత్నించిందనీ, కానీ ఆ వీరుల అమరత్వంతో ఉద్యమం మరింత ఉధతంగా సాగి బ్రిటిష్ ప్రభుత్వ పతనానికి దారి తీసిందని ఆయన అన్నారు. నేడు లఖింపూర్ ఖేరిలో రైతు ఉద్యమ నేతలను కారు తొక్కించిచంపి, భయభ్రాంతులకు గురిచేసి రైతు ఉద్యమాన్ని అణచి పెట్టాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాల్ని ఉక్కు పాదంతో అనచాలనుకుంటే ప్రజా పోరాటాలు ఉద్ధత మై ఎలా పతనం అయిందో నేడు బీజేపీ ప్రభుత్వానికి కూడా లఖింపూర్ ఖేరి ఘటన తర్వాత ప్రజా పోరాటాల తో ఆ గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమం అణచివేయటంతో పాటు వ్యవసాయ కార్మికులకు ఉపాధినీ నిర్వీర్యం చేసేలా, భూములు సంపన్నులకు కట్ట పెట్టేలా వ్యవహరిస్తున్నదని ఆయన అన్నారు. ఈ చర్యలపై జాతీయోద్యమ స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామని అన్నారు. ఈ బృందంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు శివ దాసన్, జాతీయ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ ఉన్నారు.